రైల్ కార్గో సర్వీసులను ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- February 24, 2023
యూఏఈ: జాతీయ రైల్వే నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు యూఏఈ ప్రకటించింది. ఆమోదించబడిన షెడ్యూల్, బడ్జెట్ ప్రకారం 900 కి.మీ పాన్-యూఏఈ నెట్‌వర్క్ పూర్తయింది. ఎమిరేట్స్ అంతటా కార్గో రైలు కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. అబుధాబిలోని అల్ ఫయాహ్‌లోని ప్రధాన నియంత్రణ, నిర్వహణ కోసం నెట్‌వర్క్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లో కార్యక్రమ ఫోటోలను పంచుకున్నారు.
అతిపెద్ద అవస్థాపన ప్రాజెక్టులలో ఒకటై యూఏఈ నేషనల్ రైల్వే నెట్‌వర్క్ ప్రధాన మార్గం సౌదీ అరేబియా సరిహద్దులోని ఘువైఫాత్ నుండి ఫుజైరా వరకు విస్తరించి ఉంది. ఇది అనేక భూభాగాల గుండా వెళుతుంది. ఈ మార్గంలో 593 వంతెనలు, క్రాసింగ్‌ల నిర్మాణం మరియు 6.5 కి.మీ పొడవుతో తొమ్మిది సొరంగాలు ఉన్నాయి. సరుకు రవాణా కోసం 38 లోకోమోటివ్‌లు, 1,000 కంటే ఎక్కువ వ్యాగన్‌లతో అన్ని రకాల వస్తువులను రవాణా చేయగలిగేలా నెట్ వర్క్ ని డిజైన్ చేశారు. ఇది దేశంలోని నాలుగు ప్రధాన నౌకాశ్రయాలను.. ఏడు రవాణా ప్రాంతాలను కలుపుతుంది. ఏటా 60 మిలియన్ టన్నుల వస్తువులను రవాణా చేయగలదని షేక్ మొహమ్మద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
200 బిలియన్ దిర్హామ్‌ల అంచనా విలువతో జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి నెట్‌వర్క్ దోహదపడుతుంది. ఇది రహదారి నిర్వహణ ఖర్చులలో 8 బిలియన్ దిర్హామ్‌లను ఆదా చేస్తుంది. నెట్‌వర్క్ పర్యాటక ప్రయోజనాలు Dh23 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఎతిహాద్ రైల్ యూఏఈ నేషనల్ రైల్వే నెట్‌వర్క్ మొదటి దశ జనవరి 2016 నుండి పనిచేస్తోంది. అడ్నోక్ తరపున హబ్షన్ , షా నుండి రువైస్‌కు ప్రతిరోజూ 22,000 టన్నుల వరకు గ్రాన్యులేటెడ్ సల్ఫర్‌ను రవాణా చేస్తుంది. రెండవ దశ 2020లో ప్రారంభమైంది. తాజా రవాణా నెట్ వర్క్ నిర్మాణం కోసం 11 మంది కాంట్రాక్టర్లు, 25 మంది కన్సల్టెంట్లు, 28,000 మంది నిపుణులు పనిచేశారు. ఇది 180 ప్రభుత్వ సంస్థల నుండి 40,000 ఆమోదాలను పొందింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







