యూఏఈలోను 'అపరిమిత' వార్షిక సెలవు విధానం!
- February 24, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా 'అపరిమిత' వార్షిక సెలవు విధానాన్ని అమలు చేసిన కంపెనీలు ఉద్యోగుల రిటెన్షన్ తోపాటు మెరుగైన ఉత్పాదకత సాధించినట్లు నివేదించాయి. దీంతో ఈ విధానంపై యూఏఈలో చర్చ మొదలైంది. అపరిమిత సెలవు దినాల భావన చాలా అరుదుగా ఉన్నప్పటికీ, అది సాధ్యమేనని యూఏఈలోని పలు కంపెనీల్లోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాల్లో, టెక్నాలజీ రంగంలోని సంస్థలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. దీనిని యూఏఈలోని టెక్ రంగంలో బహుళజాతి సంస్థలలో కూడా అమలు చేస్తే అద్భుత ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గ్లోబల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ హేస్‌లో కన్సల్టెంట్ జేమ్స్ టోయ్ తెలిపారు. యూఏఈలోని ఉద్యోగులకు వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌కు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
దుబాయ్‌కి చెందిన సూపర్ యాప్ కరీమ్ రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ డైరెక్టర్ కై సిన్ టాన్ మాట్లాడుతూ.. అపరిమిత సెలవు దినాల విధానం ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు కుటుంబాలతో ఎక్కువ కాలం గడపడం కంపెనీ ఉత్పాదనపై ప్రభావం చూపుతుందన్నారు. ఉద్యోగులకు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించిన పక్షంలో దాని ప్రభావం కంపెనీ ఉత్పాదకత, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







