కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
- February 26, 2023
తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకులుగా పేరొందిన కె విశ్వనాథ్ ఫిబ్రవరి 2న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతుండగానే మరో విషాద వార్త షాక్ ఇచ్చింది. కళాతపస్వి కన్నుమూసి నెల రోజులైనా గడవక ముందే ఆయన సతీమణి జయలక్ష్మి గుండె పోటుతో మరణించారు. కళాత్మక సినిమాలతో తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన కె విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన 24 రోజులకే ఆయన భార్య కూడా మరణించడం కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆవిడ వయసు 86 ఏళ్లు కాగా.. అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు జయలక్ష్మి.
కళాతపస్వి కె విశ్వనాథ్ చనిపోయే నాటికే జయలక్ష్మి మంచానికి పరిమితమై ఉన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6.15 గం.కు మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. విశ్వనాధ్ మాదిరే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. కె.విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే ఆయన ఇండియాకు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







