రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్ అయిన సేల్స్ ఉమన్
- March 02, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో ఫిలిప్పీన్స్ సేల్స్ ఉమన్ 10 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. 40 ఏళ్ల ఫిలిపినా సేల్స్ ప్రమోటర్ అర్లీన్ కష్ట సమయాల్లో స్నేహితుల నుండి Dh10 నుండి Dh100 వరకు అప్పుగా తీసుకునేవారు. అలాంటి అర్లీన్ మహ్జూజ్ (Mahzooz) ఇటీవల నిర్వహించిన సూపర్ సాటర్డే డ్రాస్‌లో భారీ Dh10-మిలియన్ గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకొని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్ అయ్యారు. గత12 సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్న అర్లీన్ ఒక సంవత్సరం నుండి మహ్జూజ్‌లో పాల్గొంటోంది. ప్రతి వారం కచ్చితంగా ఒక టిక్కెట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్‌గా మారిన రెండవ ఫిలిపినో అర్లీన్. జనవరి చివరలో ఫిలిపినో ప్రవాసుడు స్టోర్ మేనేజర్ రస్సెల్ రేయెస్ టుయాజోన్( 34) రాఫిల్ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నారు. మహ్జూజ్ ప్రకారం.. 2021లో మహ్జూజ్ డ్రా ప్రారంభించినప్పటి నుండి అర్లీన్ తో సహా ఐదుగురు ఫిలిపినోలు బహుళ-మిలియనీర్లు అయ్యారు. ‘‘మహ్జూజ్‌లో పాల్గొనేవారిలో ఫిలిపినోలు రెండవ అతిపెద్ద సమూహం. మొత్తం 50,000 మంది ఫిలిపినోలు Dh350 నుండి Dh10 మిలియన్ల వరకు మొత్తం Dh62 మిలియన్ల వరకు బహుమతులు గెలుచుకున్నారు." అని మహ్జూజ్ మేనేజింగ్ ఆపరేటర్ ఎవింగ్స్ సీఈఓ ఫరీద్ సామ్‌జీ వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







