సమంత చేతుల్లోనే విజయ్ భవిష్యత్తు.!
- March 02, 2023
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషీ’ అనే సినిమా సెట్స్‌పై వున్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. క్యూట్ అండ్ లవ్‌లీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ అనంతరం సమంత అనారోగ్యం కారణంగా ఆగిపోయింది.
ఈ మధ్యనే సమంత మయోసైటిస్ నుంచి కోలుకోవడం, మళ్లీ షూటింగులకు హాజరవడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రస్తుతం సమంత బిజీగా వుంది.
ఇక, ‘ఖుషీ’ కోసం మరో పది పదిహేను రోజుల్లో సెట్స్‌లో అడుగు పెట్టనుందట సమంత. అసలే ‘లైగర్’తో డిజాస్టర్ కొట్టి, అడ్రస్ గల్లంతు చేసుకున్న విజయ్ దేవరకొండకి ‘ఖుషీ’ సినిమా చాలా చాలా ప్రతిష్టాత్మకం. ఈ సినిమాపైనే రౌడీ విజయ్ భవిష్యత్తు అంతా ఆధారపడి వుంది. ఈ సినిమాతో హిట్టు కొడితేనే, టాలీవుడ్‌లో తాను ఇంతవరకూ సంపాదించుకున్న క్రేజ్ నిలబడేది. చూడాలి మరి ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







