'యూఏఈ రీడ్స్' గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- May 04, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపట్టిన సాంస్కృతిక స్ఫూర్తి 'యూఏఈ రీడ్స్' గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 'లార్జెస్ట్ రీడింగ్ లెస్సన్' కేటగిరీలో యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. షేక్ షమ్మా బింట్ మొహమ్మద్, 'వరల్డ్స్ లార్జెస్ట్ రీడింగ్' అవర్‌లో పలు అంశాల్ని చదువుతుండగా 2,604 మంది మహిళలు ఈ అద్భుత ఘట్టానికి సాక్షులుగా నిలిచారు. 'ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016'లో భాగంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇది దేశానికి అత్యంత గర్వకారణమని పోలీస్ కాలేజ్ డైరెక్టర్ జనరల్ కల్నల్ వలీద్ సలీమ్ అల్ షమెసి చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన పలువురు సిబ్బంది ఈ అద్భుత ఘట్టంలో పాలుపంచుకున్నారు. 'స్పిరిట్ ఆఫ్ రీడింగ్' అనే ఉద్దేశ్యంతో జనరల్ నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరూ సంపాదించుకునేలా ఈ ఏడాదిని 'ఇయర్ ఆఫ్ రీడింగ్' అని ప్రకటించి, పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈ 'యూఏఈ రీడ్స్'ని కూడా చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







