మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2..
- March 04, 2023
తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. దీంతో పలు షోలకు సీజన్ 2 అంటూ కొనసాగింపుగా మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి సరికొత్త షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసి ఎంతో మంది సింగర్స్ ని పరిచయం చేశారు.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇటీవలే సీజన్ 2 కి ఆడిషన్స్ నిర్వహించి అనేకమంది సింగర్స్ ని తీసుకొచ్చి షోని గ్రాండ్ గా మొదలుపెట్టారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని సింగర్ హేమచంద్ర హోస్ట్ చేస్తుండగా జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు ఉన్నారు.
తాజాగా ఈ సీజన్ నుంచి మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ లో అనేక మంది కొత్త సింగర్స్ తో, బోల్డంత ఎంటర్టైన్మెంట్ తో సాగింది. ఈ ఎపిసోడ్ ని ఆహాలో చూసేయొచ్చు. ప్రతి శుక్రవారం, శనివారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఎపిసోడ్స్ ఆహాలో స్ట్రీమ్ అవ్వనున్నాయి. అలాగే ఇన్నాళ్లు ఆహా సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి 399 ఉండగా మార్చ్ మహా ఆఫర్ అంటూ 299కే అందిస్తుంది. దీంతో మరింతమంది ఆహా ఓటీటీని సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కూడా గత సీజన్ లాగే మంచి హిట్ అవుతుందని, పలువురు ప్రముఖులు మధ్యలో గెస్టులుగా వస్తూ ఉంటారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







