ఖతార్ రియల్ రంగం: 2023 మొదటి త్రైమాసికంలో స్థిర వృద్ధి
- March 04, 2023
ఖతార్: ఖతార్ హౌసింగ్ మార్కెట్ ఈ సంవత్సరం కూడా స్థిరంగా సాగనుంది. దేశ వ్యాప్తంగా ప్లాట్ల ధరలు, అద్దెలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. 2023 మొదటి త్రైమాసికంలో లాభదాయకంగా ఉంటుందని అంచనా వేశారు. ఫిఫా ప్రపంచ కప్ తర్వాత ధరలు తగ్గుతాయని భావించిన వారికి ఇది కొంత నిరాశ కలిగించే అంశమే. మరోవైపు అద్దెల పెరుగుదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్‌పార్క్ ప్రాపర్టీ మేనేజింగ్ డైరెక్టర్ జెఫ్రీ అస్సెల్‌స్టైన్ మాట్లాడుతూ.. ఖతార్ అద్దె మార్కెట్ వేగంగా మారుతూనే ఉందని, నవంబర్ - డిసెంబర్ 2022లో మెగా ఈవెంట్ జరిగిన తర్వాత ధరలు తగ్గుతాయని ఖతార్ నివాసితులు అంచనా వేశారని, కానీ మార్కెట్ మారడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖతార్‌లోని కొన్ని ఉత్తమ ప్రదేశాలలో రియల్ వ్యాపారం స్థిరంగా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్లాట్ల విక్రయాలు, లీజింగ్ కార్యకలాపాల సంఖ్య బాగా పెరిగిందని రియల్ ఎస్టేట్ నిపుణుడు పేర్కొన్నారు. గ్లోబల్ ప్రాపర్టీ గైడ్ ఇటీవలి డేటా ప్రకారం.. పన్ను-రహిత జీవనశైలి మధ్య మధ్యప్రాచ్యంలో నివసించడానికి ఖతార్ అత్యంత ఖరీదైన నివాస దేశం. 2022లో ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు భారీగా పెరిగాయి. అనేక మంది పర్యాటకులు రావడం, ప్రవాసులు పునరావాసం ఎంచుకోవడం, ప్రపంచ పెట్టుబడులు పెట్టడం, ఖతార్ ఇతర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా పెరగడం కారణంగా రాబోయే రోజుల్లో ఖతార్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథాన దూసుకెళ్తుందని రియల్ మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







