ఈ 10 ట్రాఫిక్ ఉల్లంఘనలకు 50% తగ్గింపు పథకం వర్తించదు
- March 05, 2023
యూఏఈ: షార్జా ఇటీవల మార్చి 31కి ముందు నమోదు చేసిన ఉల్లంఘనలకు ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపు ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇది తీవ్రమైన నేరాలకు వర్తించదని పోలీసులు స్పష్టం చేశారు. పెనాల్టీలను సగానికి తగ్గించడంతో పాటు, కొత్త పథకం కింద ఇంప్పౌండ్‌మెంట్ ఆర్డర్‌లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా 10 నిర్దిష్ట ట్రాఫిక్ ఉల్లంఘనలకు తగ్గింపు వర్తించదని షార్జా పోలీస్ ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగంలో ట్రాఫిక్ అవేర్‌నెస్, మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షిబా తెలిపారు.
ట్రాఫిక్ జరిమానా ఆఫర్ వర్తించని నేరాల జాబితా:
- అతని లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వాహనం నడపడం: 2,000 దిర్హామ్ జరిమానా, 23 బ్లాక్ పాయింట్లు
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ సౌకర్యాలకు నష్టం కలిగించే విధంగా వాహనం నడపడం: Dh2,000 మరియు 23 పాయింట్లు
- మద్యం సేవించి వాహనం నడపడం (పెనాల్టీని కోర్టు నిర్ణయిస్తుంది)
- నంబర్ ప్లేట్లు లేకుండా డ్రైవింగ్: Dh3,000 జరిమానా, 23 పాయింట్లు
- 80kmph కంటే ఎక్కువ వేగంతో నడపడం: Dh3,000 జరిమానా, 23 పాయింట్లు
- పెనాల్టీని తప్పించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులను చూసి పారిపోవడం: Dh800 జరిమానా, 12 పాయింట్లు
- ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా ఒక వ్యక్తి మరణానికి కారణం (పెనాల్టీని కోర్టు నిర్ణయిస్తుంది, అదనంగా 23 పాయింట్లు)
- ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా ప్రమాదం లేదా గాయాలు కావడం (పెనాల్టీని కోర్టు నిర్ణయిస్తుంది, అదనంగా 23 పాయింట్లు)
- అనుమతి లేకుండా వాహనం ఇంజిన్‌ను మార్చడం: Dh1,000 జరిమానా, 12 పాయింట్లు
- లైసెన్స్ లేకుండా ప్రమాదకర పదార్థాలను రవాణా చేయడానికి వాహనాన్ని ఉపయోగించడం: 3,000 దిర్హామ్ జరిమానా, 24 పాయింట్లు
షార్జా ప్రకటించిన ట్రాఫిక్ జరిమానాల్లో 50 శాతం తగ్గింపు ఆఫర్ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







