మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
- March 06, 2023
హైదరాబాద్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ శాఖలలోని మహిళా ఉద్యోగులు అందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గా అనౌన్స్ చేసింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలంటూ ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
అదేవిధంగా ఈ నెల 8న హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళల ఎదుగుదలను గుర్తించే రోజుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఉమెన్స్ డే ను ఘనంగా జరుపుకుంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







