3 బిలియన్ దిర్హామ్‌లతో దుబాయ్‌లో ల్యాండ్ మార్క్ స్టేడియం
- May 04, 2016
60,000 మంది వీక్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మొహమ్మద్ బిన్ స్టేడియం ఇన్నోవేటివ్ మోడల్ పైలట్ డిజైన్ వివరాల్ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తెలియజేశారు. 3 బిలియన్ దిర్హామ్‌లు ఈ స్టేడియం నిర్మాణానికి ఖర్చు కానుంది. దుబాయ్‌లోని అల్ వీర్ ఏరియాలో దుబాయ్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ స్టేడియం నిర్మితం కానుంది. దుబాయ్ స్పోర్ట్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మట్టర్ అల్ తయెర్ స్టేడియంకి సంబంధించిన వివరాల్ని, షేక్ మొహ్మద్ పర్యటన సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ స్టేడియం దుబాయ్‌కి ఓ ల్యాండ్ మార్క్ అవుతుందని ఆయన చెప్పారు. 60,000 మంది వీక్షకులు, 8941 వీఐపీల కోసం ఏర్పాట్లు, అలాగే టెర్రాస్ కింద 6688 సీట్లను ఈ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ హాల్స్‌ని కూడా పొందుపర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు డిజైనర్లతో ఈ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని షేక్ మహమ్మద్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







