ఉమెన్స్ డే

- March 08, 2023 , by Maagulf
ఉమెన్స్ డే

ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.విజయవంతమైన  మహిళలు  మిగతావారి  కన్నా వేరుగా ఆలోచిస్తారు వారికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ. మరి అందరూ అలాంటి మహిళలు గా అవ్వాలి అంటే  ముఖ్యంగా కావాల్సినవి..

1  అస్సేర్టివ్ నెస్:   ( అస్సేర్టివ్ నెస్ ) 
2   క్లారిటీ అఫ్ థాట్స్ &  ఫీలింగ్స్ :    ( ఆలోచనల, ఫీలింగ్స్  మీద  స్పష్టత   ) 
3   ఫిసికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్   ( శారీరిక మరియు మానసిక దృఢత్వం )
4    ఫైనాన్సియల్  ఇండిపెండెన్స్( ఆర్ధిక స్వాతంత్య్రం )  
5    రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్  ( బాధ్యతాయుతమైన స్వాతంత్య్రం) 
6    ప్రాబ్లెమ్ సొల్వింగ్  స్కిల్స్  ( సమస్యని పరిష్కరించే నైపుణ్యం )

అస్సేర్టివ్ నెస్:
ఏదైనా విషయాన్ని దృఢంగా నొప్పించకుండా చెప్పగలగాలి. మహిళలు మామూలుగా చాలా సున్నిత మనస్కులు అవ్వటం వల్ల వాళ్లకి ఎంత బాధ వచ్చినా పక్కవాళ్ళు  ఏమనుకుంటారో అని వాళ్ళ  బాధని చెప్పటానికి జంకుతారు. దానివల్ల నెమ్మదిగా మనల్ని అర్ధం చేసుకునే వాళ్ళు లేరు అని నిరుత్సాహం ,స్ట్రెస్, టెన్షన్, మరియు మూడ్ స్వింగ్స్ లాంటి వాటి బారిన పడతాము. అస్సేర్టివ్ గా ఉండడం అంటే మనకి నచ్చనిది ఏది ఐన డైరెక్ట్ గా ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా చెప్పటం, దీనివల్ల మనలని అర్ధం చేసుకోవం చాలా తేలిక గా ఉంటుంది.

క్లారిటీ అఫ్ థాట్స్ &  ఫీలింగ్స్ : (ఆలోచనల, ఫీలింగ్స్  మీద స్పష్టత) 
మామూలుగా మహిళలు ఇంట్లో protected గా ఉంటారు అండ్  అన్నిటికి అడ్జస్ట్ అవ్వుతూ ఉంటారు . దీని వల్ల సెల్ఫీశ్నేస్ కి , సెల్ఫ్ కేర్ కి తేడా తెలియకుండా అవుతుంది. ఒక విషయం వల్ల మనం బాధ పడితే అది నిజం గా మనల్ని హర్ట్ చేసింది అని ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో ఆలోచించగలుగు తాము . అదే మనకి మనమే ఇచ్చే గౌరవం.

ఫిసికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్: ( శారీరక మరియు  మానసిక దృఢత్వం) 
శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మానసిక వ్యాయామం కూడా అంతే ముఖ్యం. యోగ, మెడిటేషన్ లేదా దైవ పూజ  లాంటివి ప్రతి రోజు  చెయ్యటం నేర్చుకోవాలి. 

ఫైనాన్సియల్  ఇండిపెండెన్స్: (ఆర్ధిక స్వాతంత్య్రం)
గొప్ప చదువు వ్యక్తిత్వం తో పాటు  ప్రతి మహిళా తాను ఆర్ధికం గా స్వతంత్రురాలు అవ్వటం ఎంతో ముఖ్యం. దీని వల్ల ఆత్మవిశ్వాసం  పెరగటమే కాదు కుటుంబం  లో కూడా మనకి గౌరవం పెరుగుతుంది.  మనం వేరే వాళ్ళకి సహాయం చెయ్య గల ఆవకాశం కూడా లభిస్తుంది.

రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ : (బాధ్యతాయుతమైన స్వతంత్రం)
మనం మన పరిధులు ఏమిటి అన్నది క్లియర్ గా తెలుసుకోవాలి. విశృఖలత్వానికి స్వాతంత్య్రానికి తేడా తెలుకోవటం చాలా అవసరం. ఎలా అయితే కారు డ్రైవింగ్ చేసేప్పుడు మనం డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని దానికి కావాల్సిన పేపర్స్ అన్ని సరిగ్గా ఉంచుకున్న తర్వాత  ఎక్కడకి వెళ్ళాలి అన్నది మన ఇష్టం . అలానే మన లైఫ్ లో కూడా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుని స్వతంత్రం గా బ్రతకటం నేర్చుకోవాలి .

ప్రాబ్లెమ్ సొల్వింగ్  స్కిల్స్ : (సమస్యని పరిష్కరించే నైపుణ్యం)
జీవితం లో సమస్యలు ఎదురవ్వడం చాలా మామూలు విషయం అని గుర్తించి. 
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించుకునే మార్గాలు వెతుక్కోవటం నేర్చుకోవాలి. దానికి కావాల్సిన నైపుణ్యం పెంచుకోవాలి.

ఆఖరుగా..
అర్థం చేసుకొవాలి అన్నా ఆమె తర్వాతే ..
సహనం లో  కూడా ఎవరైనా ఆమె తర్వాతే 
మనోబలం లో కూడా పోటీపడాలంటే ఆమె తర్వాతే 
ఔదార్యం నేర్చుకోవాలి అంటే ఆమె నుండే 
అదే ఆమెలోని అందం..
అలాంటి వనితలందరికి 

లెట్ అస్ సెలెబ్రేట్ వుమెన్ హుడ్

  --ఉమాదేవి వాడ్రేవు, సైకాలజీ కౌన్సిలర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com