సౌదీలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు
- March 08, 2023
రియాద్: సౌదీ అరేబియాలో కొత్తగా నియమితులైన మంత్రులు కింగ్ సల్మాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరి, రాష్ట్ర మంత్రి, క్యాబినెట్ సభ్యుడు ఇంజినీర్ ఇబ్రహీం అల్-సుల్తాన్ మంగళవారం రియాద్‌లోని ఇర్కా ప్యాలెస్‌లో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని రెండు పదవుల్లో నియమిస్తూ రాయల్ ఆర్డర్ జారీ అయిన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం క్రౌన్ ప్రిన్స్, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో జరిగింది. తమ దేశానికి విధేయుడిగా ఉంటానని, ప్రభుత్వ రహస్యాలు ఏవీ బహిర్గతం చేయమని, నిజాయితీ, విశ్వసనీయత, చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తిస్తామని ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







