చిన్నారి 'ఫైర్ గర్ల్'ని సత్కరించిన పోలీసులు

- March 08, 2023 , by Maagulf
చిన్నారి \'ఫైర్ గర్ల్\'ని సత్కరించిన పోలీసులు

యూఏఈ: అగ్నిప్రమాదానికి గురైన లౌలోవా నివాస సముదాయం (పెర్ల్ టవర్) పునరావాస సమయంలో రెస్క్యూ సిబ్బంది, బాధితులకు మద్దతుగా నిలిచినందుకు 'ఫైర్ గర్ల్' అనే ముద్దుపేరుతో పిలిచే చిన్నారి ఫాతిమా అల్ మజ్మీని అజ్మాన్ పోలీసులు ఘనంగా సత్కరించారు. అల్ రషీదియా ప్రాంతంలోని నివాస సముదాయంలో ఫిబ్రవరి 17న భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అజ్మాన్ పోలీసులు,  సివిల్ డిఫెన్స్ సిబ్బంది చాలా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వందలాది మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి కల్పించారు. మొత్తం 280కిపైగా కుటుంబాలకు తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో  'ఫైర్ గర్ల్' ఫాతిమా,  ఆమె తల్లి ప్రతిరోజూ ప్రమాద బాధితులకు.. పోలీసు - సివిల్ డిఫెన్స్ బృందానికి అల్పాహారం అందజేశారు.

ఫాతిమా తన తండ్రి, తల్లితో కలిసి పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.  అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్-నైమి వారి దాతృత్వాన్ని ప్రశసించి ఘనంగా సత్కరించారు. వీరిచ్చిన అందజేసిన మద్దతు ఎమిరేట్ ప్రజల దాతృత్వాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది వారి పిల్లలకు వారసత్వంగా అందించబడుతుందని తెలిపారు.  సంక్షోభ సమయంలో పోలీసులకు, రెస్క్యూ టీమ్‌లకు మద్దతు అందించడం.. బాధితుల ప్రాణాలను కాపాడటంలో.. సమాజాన్ని రక్షించడంలో వారు చేస్తున్న ప్రయత్నాలతో పోల్చుకుంటే తాము చేసింది చాలా చిన్నదని ఫాతిమా కుటుంబసభ్యులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com