ఆఫ్గనిస్తాన్ లో మహిళల నిరసన
- March 08, 2023
కాబూల్: మహిళల, బాలికల హక్కులను కాలరాస్తూ.. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ''ప్రపంచంలో అత్యంత అణచివేత దేశం'' గా నిలిచిందని ఐక్యరాజ్యసమితి బుధవారం ప్రకటించింది. ఆఫ్ఘన్ మహిళలను రక్షించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ.. మీడియా సాక్షిగా బుధవారం కాబూల్ వీధిలో సుమారు 20 మంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు. మహిళలు, బాలికలపై గృహనిర్బంధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘన్‌ను చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబన్ ప్రభుత్వం ఇస్లాం మతం పేరుతో మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ఘన్ మహిళలు, బాలికలు బయటకు రాకుండా తాలిబన్లు పద్ధతి ప్రకారం, ఉద్దేశపూర్వకంగా, క్రమబద్ధంగా చేపడుతున్న చర్యలు బాధకలిగిస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్లోని ఐరాస మిషన్ హెడ్ రోజా ఒటున్బయేవా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోని అతిపెద్ద మానవతా, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ అణచివేత చర్యలు ఆ దేశాన్నే ప్రమాదంలోకి నెడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 80 శాతం మంది పాఠశాల వయస్సు గల బాలికలు, యువతులు మొత్తంగా 2.5 మిలియన్ల మంది పాఠశాల విద్యకు దూరమయ్యారని యునెస్కో తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







