అల్ ధామన్ ఇన్సూరెన్స్ కంపెనీ లైసెన్స్ రద్దు
- March 09, 2023
మస్కట్: ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని నిర్వహించే అల్ ధామన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ఉత్తర్వులు జారీ చేసింది. చట్టబద్ధంగా కంపెనీ పరిస్థితిని సర్దుబాటు చేయడంలో విఫలమైనందుకు బీమా బ్రోకర్ల రిజిస్టర్ నుండి కంపెనీని తొలగించినట్లు అథారిటీ తెలిపింది. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ రెగ్యులేషన్ ఆర్టికల్ 4ను ఉల్లంఘించినందుకు చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని నాలుగు నెలల పాటు నిర్వహించకుండా కంపెనీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్ల CMA పేర్కొంది. కంపెనీలు తప్పనిసరిగా CMAకి రెండు ఆడిట్ చేయబడిన వార్షిక బడ్జెట్లు, దానితో పాటు వచ్చే ఖాతాలను ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజులలోపు సమర్పించాలి.CMA అన్ని బీమా బ్రోకర్లను వారి ఆర్థిక స్థితిగతులను అనుసరించడానికి వారి ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికలను పరిశీలించి.. బ్రోకర్ కంపెనీతో వ్యవహరించే అన్ని పార్టీలకు తగిన రక్షణను అందించడానికి కంపెనీ అన్ని చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి ఉందని సీఏంఏ నిర్ధారిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







