సీఎం కేసీఆర్కు అస్వస్థత..
- March 12, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబసభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఏఐజి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగా ఉందని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారని ఏఐజీ డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి సి.టి, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏఐజీ డాక్టర్లు వెల్లడించారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







