కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- July 01, 2026
కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో బుధవారం మరోసారి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.డిపోలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటలను గమనించిన డిపో సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక పరికరాలతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు.ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బస్సుకు కొంత మేర నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన పై ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. బ్యాటరీలో సాంకేతిక లోపమే మంటలకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కాగా, పది రోజుల వ్యవధిలో కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం ఇది రెండో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రత, నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







