జాన్వీ కపూర్ మరీ ఓవరాక్షన్ చేస్తోందిగా.!
- March 20, 2023
అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ కాస్త ఓవరాక్షన్ ఎక్కువే చేస్తున్నట్లుంది. హీరోయిన్గా ఈ అందాల భామ కెరీర్ స్టార్ట్ చేసి ఏకంగా పదేళ్లు దాటింది.
ఈ పదేళ్ల కాలంలో సౌత్ ఎంట్రీ కోసం సౌత్ మేకర్లు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత ప్రయత్నించినా ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంది. ఎట్టకేలకు ఎన్టీయార్ 30 తో జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
అయితే, ఎన్టీయార్‌తో సినిమా కన్ఫామ్ కావాలని ప్రతీరోజూ దేవుడికి మొక్కేసేదట. ఈ సినిమా ఓకే అవ్వాలని జాన్వీ మొక్కని దేవుడు లేడట.. ‘హా.! ఏంటిది.! ఇదంతా నిజమేనా.! అని ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజమే మరి, జాన్వీ చెబుతున్న ఈ మాటలు అస్సలు నమ్మశక్యంగా లేవు కదా.
అప్పుడేమో అనవసరమైన కారణాలు చెప్పింది. ఇప్పుడేమో ఇలాంటి కథలు చెబుతోందేంటీ.? ఈ పదేళ్లలో ఎన్ని మంచి మంచి అవకాశాల్ని జాన్వీ తిప్పి కొట్టేసింది.. అంటూ నెటిజన్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







