చరణ్ హాలీవుడ్ ఎంట్రీపై పక్కా లెక్కలతో వున్నాడట.!

- March 20, 2023 , by Maagulf
చరణ్ హాలీవుడ్ ఎంట్రీపై పక్కా లెక్కలతో వున్నాడట.!

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్‌కి వచ్చిన గుర్తింపు సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూనివర్సల్ కాదు, గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు రామ్ చరణ్. అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మార్మోగిపోయింది.
ఈ నేపథ్యంలోనే త్వరలో రామ్ చరణ్ ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతున్నాడన్న వార్త బయటకి వచ్చింది. ఈ వార్తకు అనుగుణంగా రామ్ చరణ్ వద్ద ఆ ప్రస్థావన తీసుకురాగా.. అవును నిజమే అని రామ్ చరణ్ కూడా కన్‌ఫామ్ చేసేశారు.
అంటే రామ్ చరణ్ హాలీవుడ్ మూవీ నిజమేనన్నమాట. అయితే, ఆ ముచ్చట ఎప్పుడు.? అంటే.. అందుకు ప్రస్తుతం ప్రాసెస్ కూడా నడుస్తోందనీ రామ్ చరణ్ చెప్పాల్సి వచ్చింది. 
త్వరలోనే తన హాలీవుడ్ సినిమాపై డీటెయిల్స్‌తో కూడిన అప్‌డేట్ ఇస్తానని రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com