మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందా.?
- March 21, 2023
అంతా బాగానే వుంటే.. తమ తమ పర్సనల్ యాక్టివిటీస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఏమాత్రం తేడా కొట్టినా జీవిత భాగస్వాములే అయినా సరే, నిర్మొహమాటంగా ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకుంటారు.
అలా జరిగిందంటే చాలు.. లవర్స్ అయితే బ్రేకప్.. మేరీడ్ అయితే, డివోర్స్‌డ్.. అంటూ ప్రచారం చేసేస్తుంటారు. తాజాగా ఈ తరహా ప్రచారపు సెగ మెగా ఫ్యామిలీని తాకింది. మొన్నటికి మొన్న శ్రీజ, కళ్యాణ్ దేవ్ డివోర్స్ తీసుకుంటున్నారంటూ రచ్చ.
తాజాగా నిహారిక డివోర్స్ ఇష్యూ నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక, ఈ మధ్య అభిప్రాయ బేధాల కారణంగా అతనితో విడిపోవాలనుకుంటోందనీ, ఆ కారణంగానే తను ప్రస్తుతం పుట్టింట్లోనే వుంటోందనీ పై వార్తల సారాంశం.
మరోవైపు జొన్నలగడ్డ చైతన్య తన ఇన్‌స్టా నుంచి నిహారికతో వున్న ఫోటోలు డిలీట్ చేయడం ఇద్దరూ ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు ఆద్యం పోస్తోంది. అసలింతకీ ఈ ప్రచారం నిజమేనా.? మెగా ఫ్యామిలీ రెస్సాండ్ అయితే కానీ తెలియదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







