సూపర్ ‘కమర్షియల్’ ట్రెండింగ్.! అసలు మ్యాటర్ ఏంటంటే.!
- March 21, 2023
‘మహేష్..’ ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్.. అంటూ ఓ సినిమాలో హీరోయిన్ తెగ మురిసిపోతుంటుంది. అఫ్‌కోర్స్.! ఆ ఒక్క హీరోయినే కాదండోయ్.. మహేష్ బాబు పేరు వింటనే అమ్మాయిల గుండెల్లో అదిరే వైబ్రేషన్ అదో మాదిరే.
ప్రస్తుతం ఆయన గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్‌పై వుంది ఈ సినిమా. ఉగాదికి ఈ సినిమాకి సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ సంసిద్ధమవుతున్నాడన్న ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఫ్యాన్స్ వున్నారు.
అంతకన్నా ముందే మహేష్ బాబు ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. స్టైలిష్ లుక్స్‌తో కిల్ చేస్తున్న మహేష్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. బహుశా సినిమాకి సంబంధించిన వీడియోనేమో అనుకుంటారా.? కాదండోయ్. ఇదో కమర్షియల్ యాడ్ కోసం షూట్ చేస్తున్న వీడియో ఇది.
కమర్షియల్ యాడ్స్‌లోనూ మహేష్ బాబు సూపర్ స్టారే అన్న సంగతి తెలిసిందే. హీరోల్లో అత్యంత ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేసిన రికార్డు మహేష్ బాబు సొంతం. తాజా యాడ్ దేనికోసమో తెలీదు కానీ, ఈ వీడియో మాత్రం ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







