మంచు బ్రదర్స్‌కి ఏమైంది.? చిచ్చు చెలరేగిందిలా.?
- March 24, 2023
మంచు వారింట తుఫాన్ మొదలైంది. అదేంటీ.? ఈ మధ్యనే కదా.. మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే వుంది.. తుఫాన్ చెలరేగడమేంటీ.? అనుకుంటున్నారా.?
ఏమైందో ఏమో తెలీదు కానీ, మంచు మనోజ్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఓ వీడియో బయటికొచ్చింది. అందులో అన్న మంచు విష్ణు వర్ధన్.. ఎవరితోనో గొడవపడుతున్నట్లుగా వుంది.
ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో మంచు మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. ‘ఇదిగో ఇలాగే ఇళ్ల మీదికి వెళ్లి దౌర్జన్యం చేస్తుంటాడు..’ అన్నట్లుగా మనోజ్ వాయిస్ వినిపిస్తోంది.
అన్నదమ్ముల మధ్య చిచ్చు ఎక్కడ చెలరేగింది.? మనోజ్ సడెన్‌గా స్వయంగా ఇలాంటి వీడియోని రిలీజ్ చేయడానికి గల కారణాలేంటీ.? అనేది తెలియాల్సి వుంది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మంచు బ్రదర్స్‌కి ఏమైంది.? ఇలా కొట్టుకు ఛస్తున్నారేంటీ.? అని నెటిజన్లు తళా ఓ రకంగా చెవులు కొరుక్కుంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







