విజయ్ ‘లియో’ ఫ్యాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్.!
- March 24, 2023
‘బీస్ట్’, ‘వారసుడు’ సినిమాలతో ఈ మధ్య తమిళ హీరో విజయ్ సక్సెస్ రేటు కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే, రాబోయే కాలంలో ఆ డ్యామేజ్‌ని ఫుల్ ఫిల్ చేయబోతున్నాడు ఇళయ దళపతి విజయ్.
అందుకు కారణం ఆయన చేతిలో వున్న ప్రెజెంట్ ప్రాజెక్ట్ ‘లియో’. విశ్వ నటుడు కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడమే అందుకు కారణం.
ఈ సినిమాని అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడట లోకేష్. విజయ్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కానుందనీ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
‘విక్రమ్’తో లోకేష్ కనగరాజ్ పేరు ఓ బ్రాండ్ సెట్ చేసింది. దాంతో, ‘లియో’ని ప్రపంచ వ్యాప్తంగా డిఫరెంట్ వేస్‌లో ప్రమోట్ చేయబోతున్నారట. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఓ వైపు ‘వారసుడు’ చేస్తూనే సైమల్టేనియస్‌గా ‘లియో’ షూటింగ్ కూడా కానిచ్చేశాడు విజయ్. సో, చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. త్వరలోనే ప్రమోషన్లు ఘనంగా మొదలు కానున్నాయనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







