ఫిబ్రవరిలో సౌదీ అరేబియాకు రికార్డ్ స్థాయిలో విదేశీ సందర్శకులు
- March 24, 2023
రియాద్ : సౌదీ అరేబియాలోని పర్యాటక రంగం ఆక్యుపెన్సీ రేట్లు, విదేశాల నుండి వచ్చే సందర్శకుల సంఖ్య పరంగా చారిత్రక గణాంకాలను నమోదు చేసిందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు.జనవరి నెలలో రాజ్యానికి వచ్చిన సందర్శకుల సంఖ్య 2.4 మిలియన్లకు చేరుకోగా..ఫిబ్రవరిలో ఈ సంఖ్య 2.5 మిలియన్లు దాటింది. రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటక రంగంలో ఉన్న యజమానులు, పెట్టుబడిదారుల ఐదవ నెలవారీ వర్చువల్ సెషన్‌లో అల్-ఖతీబ్ పాల్గొన్నారు.మంత్రిత్వ శాఖ 100,000 మందికి పైగా సౌదీ యువకులు, మహిళలకు శిక్షణ ఇచ్చిందని, వీరిలో 10,400 మంది విదేశాలలో శిక్షణ పొందారని, ఈ విషయంలో SR400 మిలియన్లకు పైగా ఖర్చు చేసినట్లు అల్-ఖతీబ్ చెప్పారు. కొత్త పర్యాటక వ్యవస్థలో రంగాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మార్చి 25తో ముగియనున్న మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువులోపు ప్రతి ఒక్కరూ తమ స్థితిని త్వరగా అప్డేట్ చేసుకోవాలని కోరారు.
రమదాన్ లో ఉమ్రా పీక్ సీజన్‌లో పెద్ద సంఖ్యలో హాజరవుతారని, ఆక్యుపెన్సీ రేటు 100 కి చేరుకోవచ్చని సూచించారు. యాత్రికులకు అత్యాధునిక సేవలను అందించడంలో మక్కా, మదీనాలోని ఆతిథ్య రంగ యజమానులు చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రిత్వ శాఖ తన పరిశీలకులు, ఇన్‌స్పెక్టర్ల ద్వారా 24 గంటలూ యాత్రికుల సేవలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







