అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!
- March 24, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ సమాచారం.
కాగా, ఈ సినిమాని ఎలాగైనా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, మహేష్ బాబుకి అక్టోబర్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. గతంలో పేద్ద ఫెయిల్యూర్ ట్రాకే వుంది అక్టోబర్‌తో మహేష్ బాబుకి.
ఆ సెంటిమెంట్‌తోనే అక్టోబర్ రిలీజ్ వద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబు కూడా అక్టోబర్ రిలీజ్ పట్ల అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు.
పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







