ఎన్టీయార్ 30.! అప్పుడే లీకులా.?
- March 24, 2023
ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్ మూవీ తాజాగా సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ లోపే సినిమా నుంచి లీక్డ్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాని మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో కొరటాల తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం గత కొంత కాలంగా వినిపిస్తోంది. తాజాగా లీక్ అయిన ఫోటో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా వుందనిపిస్తోంది.
ఓ పెద్ద ట్రక్, దానికి అంటిన బ్లడ్.. ఇదీ ఈ ఫోటో స్టేటస్. ఇప్పుడీ ఫోటోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు ఎన్టీయార్ అభిమానులు.
సినిమా ఇలా సెట్స్ మీదికి వెళ్లిందో లేదో.. అప్పుడే లీకులంటే.. కష్టమే మరి. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా కొరటాల అండ్ టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి.
అన్నట్లు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







