సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్
- March 24, 2023
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.గుంటూరు మీదుగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులుపెట్టబోతుంది. ఈ రూట్ లో వందేభారత్ నడిస్తే.. సికింద్రాబాద్ -గుంటూరు మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గే అవకాశం ఉంది. అటు గుంటూరు నుంచి తిరుపతికి కూడా ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు.
సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీ నగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ.. ఆ రూట్ లో దూరం ఎక్కువ అవుతుండడంతో బీబీ నగర్ నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించారు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







