నాని దృష్టిలో ‘దసరా’ ఎలాంటి మాస్ తెలుసా.!
- March 28, 2023
నేచురల్ స్టార్ నానికి ‘దసరా’ సినిమా వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. క్లాస్ హీరో మాత్రమే కాదు నాని. కొన్ని మాస్ లుక్స్‌లోనూ కనిపించి మెప్పించాడు. అయితే, ‘దసరా’ కోసం పక్కా మాస్ హీరోగా మారిపోయాడు.
మాస్ అంటే అలాంటిలాంటి మాస్ కాదు మరి. అందుకే ‘దసరా’ని అందరూ మాస్ ఊర మాస్ సినిమా అంటున్నారు. కానీ, నాని దృష్టిలో ‘దసరా’ మనసుకు హత్తుకునే మాస్ అని అభివర్ణిస్తున్నాడు.
ఈ సినిమా విజయంపై నాని చాలా నమ్మకంగా వున్నాడు. అలాగే, ఈ సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదగబోతున్నాడు నాని.
‘ధరణి’ పాత్రలో నాని నటిస్తున్నాడు ఈ సినిమాలో. వెన్నెలగా కీర్తి సురేష్ కనిపించనుంది. శ్రీకాంత్ ఓదెల అను కొత్త కుర్రాడు డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. బాలీవుడ్‌లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండడం విశేషం. మార్చి 30న ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







