‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో అనుష్క శెట్టి ఎలా కనిపిస్తుందంటే.!
- March 28, 2023
అనుష్క అంటే ఆరడుగుల అందాల చెక్కిన శిల్పం కళ్ల ముందు మెదులుతూ వుంటుంది. అందుకే అనుష్కని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి అనిపించదు. ఫ్యాన్స్ ఆమెని స్వీటీ అని క్యూట్‌గా పిలచుకుంటుంటారు.
అయితే, ‘సైజ్ జీరో’ సినిమాని అనుష్కని ఆ స్వీట్‌నెస్‌కి దూరం చేసేసింది. సినిమా కోసం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి, ఏకంగా కెరీర్‌నే దెబ్బ తీసేసింది. సినిమా కోసం బొద్దుగా మారిన అనుష్క ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా సన్నబడలేకపోయింది.
దాంతో, కెరీర్‌లో వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో ‘నిశ్శబ్ధం’ సినిమాలో నటించిన అనుష్క మళ్లీ త్వరలో నవీన్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్‌లో అనుష్క కనిపించబోతోంది. ఆమె పాత్ర పేరుతో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారనుకోండి. ఛెఫ్ పాత్రలో అనుష్క కనిపించబోతోంది. అయితే, ఈ సినిమాలోనూ అనుష్క బొద్దుగానే కనిపించనుందనీ తెలుస్తోంది.
ఏమాత్రం సన్నబడలేదట. అయితే, కమర్షియల్ హీరోయిన్ రోల్ కాదు కాబట్టి.. ఈ సినిమాకి ఓకే అంటున్నారు. కానీ, అనుష్కని మళ్లీ పాత అనుష్కలా స్లిమ్ అండ్ స్లీకీగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది జరుగుతుందా.?
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







