బీపీ పెరగడానికి కారణాలేంటో తెలుసా.?
- March 28, 2023
బీపీ లేదా రక్త పోటు అనేది ఈ రోజుల్లో చాలా చాలా కామన్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ బీపీ పేషెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి. అందుకు కారణం మన ఆహార జీవన శైలియే.
జీవన శైలిలో కొద్దిగా మార్పులు చేసుకుంటే, అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
రక్తపోటుకు మూల కారణం ఉప్పు శాతం ఎక్కువగా వున్న ఆహార పదార్ధాలను తీసుకోవడమే.
వాటిలో మొదటి ప్లేస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎక్కువ రోజులు నిల్వ వుండేందుకు వీలుగా ప్రాసెస్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా వుంటుంది. అలాంటి ఫుడ్‌కి దూరంగా వుండాలి.
అలాగే, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలను రెగ్యులర్‌గా తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
రోజులో కనీసం అరగంట సేపైనా శారీరక వ్యాయామం వుండాలి. అది వాకింగ్ కావచ్చు.. వయసుని బట్టి సైక్లింగ్, జాగింగ్ తదితర ఏదైనా వర్కవుట్స్ కావచ్చు.
ఆల్కహాల్ అలవాటుంటే, తగ్గించుకోవాలని సంబంధిత నిపుణులు హెచ్చరిక. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, రక్తపోటును నియంత్రణలో వుంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







