లోకల్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ యంగెస్ట్ విన్నర్స్..!
- March 29, 2023
దుబాయ్: 8 ఏళ్ల దేవి, 6 ఏళ్ల ఆమె సోదరి మీరాలు యూఏఈలో స్థానిక వ్యాపార యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో అతి పిన్న వయస్కురాలైన విజేతలుగా నిలిచారు. ఈ యంగెస్ట్ సిస్టర్స్ మదర్ అనుప మాట్లాడుతూ.. దేవికి చిన్నప్పటినుంచి వంటలంటే ఇష్టమన్నారు. తాను వారి కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన కుకీ రెసిపీని రూపొందించింది. నేడు అదే కుకీ రెసిపీ చిన్నారులను విజేతలుగా నిలిపింది. దేవి తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందించేలా కుకీలను తయారు చేసినట్టు తెలిపారు. అయితే, ఇది వాణిజ్యపరంగా ఉత్పత్తి అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తల్లి నుంచి కుకీల తయారీని నేర్చుకున్న దేవి(బాబీ), మీరా(రాకీ)లు తమ ముద్దుపేర్లు వచ్చేలా బాబ్రాక్జ్ కుకీలను తయారు చేసి పేరు గడించారు. వీటి తయారిలో ఆరోగ్యకరమైన పదార్థాలు.. గుమ్మడి గింజలు, ఎండబెట్టిన ఖర్జూరాలు, ఎర్ర బియ్యం, ముంగ్ బీన్స్, కాయధాన్యాలు, పప్పులు వంటి మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఉపయోగించే గ్లూటెన్, నట్స్, రిఫైన్డ్ షుగర్, కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్‌లు, పామాయిల్ వంటి హానికరమైన పదార్థాల వినియోగానికి వీరు దూరంగా ఉంటారు. దేవి, మీరా చదివే స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ దుబాయ్‌లోని ఉపాధ్యాయుల సూచనతో వింటర్ ఫెయిర్‌లో తొలిసారి తమ ఉత్పత్తులను విక్రయించినట్లు అనుప తెలిపారు. అనంరతం కాలంలో అనేక స్కూల్ ఫెయిర్లలో విక్రయించామని, మంచి పేరు రావడంతో కమర్షియల్ ఉత్పత్తి, విక్రయాల కోసం లైసెన్స్ తీసుకున్నామని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







