రూ.22.39 కోట్ల భారీ విరాళం ప్రకటించిన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసఫ్ అలీ
- March 29, 2023
అబుధాబి: లూలూ గ్రూపు ఛైర్మన్ ఎం.ఏ యూసఫ్ అలీ తన ఉదారత చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూఏఈలో నిర్వహిస్తున్న 'వన్ బిలియన్ మీల్స్' అనే ప్రచార కార్యక్రమానికి 1కోటి దిర్హాములు విరాళం ప్రకటించారు.కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రమదాన్ స్థిరమైన ఆహార సహాయ నిధిని ప్రారంభించాలనే లక్ష్యంతో యూఏఈ ఈ 'వన్ బిలియన్ మీల్స్' ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ.. ఎండోమెంట్ క్యాంపెయిన్‌కు విరాళం ఇవ్వడం అనేది దాతృత్వానికి ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తన నిబద్ధతగా పేర్కొన్నారు.మానవతావాద పనుల్లో యూఏఈ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే 'వన్ బిలియన్ మీల్స్' సహాయ నిధి కార్యక్రమానికి సహకరించడం ద్వారా పేదలకు సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రపంచంలోని పేదలకు సహాయం చేయడానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రచారాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో దీనికి భారీ మొత్తం విరాళాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







