లేబర్ చట్టానికి సవరణలపై సౌదీ కీలక ప్రకటన
- April 01, 2023
జెడ్డా: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) కార్మిక చట్టానికి ప్రతిపాదించిన సవరణలు కేవలం సూచనలు మాత్రమేనని, ఫైనల్ దశలో వాటిని ఆమోదించలేదని స్పష్టం చేసింది. కార్మిక చట్టంలో ఏదైనా సవరణకు తుది ఆమోదం లభిస్తే అధికారిక ప్రకటన చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రతిపాదిత సవరణలు అన్ని సంస్థలు, వ్యక్తులతో భాగస్వామ్యం చేయబడ్డాయని, వారి అభిప్రాయాలు- సూచనలను తీసుకుంటున్నట్లు పేర్కొంది. మార్చి 27న ఓ వార్తాపత్రికలో వచ్చిన ఒక నివేదికకు ప్రతిస్పందనగా.. జనవరి 2021లో పబ్లిక్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్ ఇస్తిత్లా ప్రతిపాదిత సవరణలను ప్రచురించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అవి కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని, తుది ఆమోదం తర్వాతే అవి అమల్లోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







