పాదచారుల క్రాసింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు కొత్త రాడార్
- April 01, 2023
యూఏఈ: పాదచారుల క్రాసింగ్‌ల వద్ద ఆగని వాహనదారులను పర్యవేక్షించడానికి, నిబంధనలను ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి కొత్త రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సౌరశక్తితో నడిచే.. ఆటోమెటిక్ రాడార్‌లను ఏప్రిల్ 3 నుండి యాక్టివేట్ చేయనున్నట్లు ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ప్రకటించారు. పాదచారుల క్రాసింగ్‌ల వద్ద ఆగకుండా కొందరు వాహనదారులు రన్‌ఓవర్ ప్రమాదాలకు కారణం అవుతున్నారని, ఆ తర్వాత జరిగే ప్రాణ, ఆస్తి నష్టాల సంఖ్యను తగ్గించడానికి రాడార్‌లను యాక్టివేట్ చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జీబ్రా క్రాసింగ్‌ల గుండా వెళ్లే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పాదచారులకు దారి ఇవ్వాలని అధికార యంత్రాంగం కోరింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. పాదచారులకు దారి ఇవ్వని వాహనదారులకు 500 దిర్హామ్‌లు జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు ఫైన్ పడుతుంది. పాదచారుల క్రాసింగ్‌ల వద్ద ఆగని వాహనదారులను పర్యవేక్షించడానికి, పట్టుకోవడానికి అబుధాబిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నడిచే రాడార్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







