ఆరెంజ్’ రీ రిలీజ్ కనీ వినీ ఎరుగని రికార్డు.!
- April 01, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడో సినిమా ‘ఆరెంజ్’. ‘చిరుత’గా పరిచయమై ‘మగధీర’గా స్టార్డమ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘మగధీర’ సూపర్ సక్సెస్ తర్వాత వచ్చిన సినిమానే ‘ఆరెంజ్’. డిజాస్టర్‌గా ముద్ర వేయించుకుంది.
అప్పట్లో ఈ సినిమా చాలా మందికి అర్ధం కాలేదు. దాంతో, పక్కా డిజాస్టర్ మూవీ అని తేల్చేశారు. నిర్మాతగా నాగబాబుకూ భారీ స్థాయిలో నష్టాలు మిగిల్చిందీ సినిమా.
కానీ, ఆ నష్టాల్ని ఇన్నేళ్ల తర్వాత నాగబాబు కవర్ చేసేసుకున్నాడు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య.. ఇలా స్టార్ హీరోల సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకున్నాయ్ రీ రిలీజ్లో. వాటన్నింటి రికార్డుల్నీ తిరగరాస్తూ సరికొత్త రికార్డు సృష్టించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ‘ఆరెంజ్’ రీ రిలీజ్ ద్వారా.
అప్పుడు ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడెందుకు ఇంతలా హిట్ అయిపోయింది. ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించాలనుకున్నారు. కానీ, ఏకంగా మూడు రోజులు ప్రదర్శించడం జరిగింది. అలా ప్లాప్ సినిమా రీ రిలీజ్‌తో కూడా రికార్డులు కొల్లగొట్టిన రారాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







