భారత్ కరోనా అప్డేట్
- April 14, 2023
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొవిడ్ -19 విజృంభణ కొనసాగుతోంది. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరింది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ యొక్క కొత్త XBB.1.16 వేరియంట్ తీవ్రతకు దారితీస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. కరోనా కేసుల రికవరీ రేటు 98.71శాతం వద్ద కొనసాగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01శాతంగా నమోదైంది. వారానికి అనుకూలత రేటు 4.29శాతంగా ఉంది. 4,42,16,583 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 12న 7,830 కొత్త కేసులు నమోదు కాగా, 13న 10,158 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యయాయి. శుక్రవారం (14వ తేదీ) కొత్త కేసుల సంఖ్య 11,109కు చేరింది. గడిచిన 24గంటల వ్యవధిలో 29మంది కరోనాతో బాధపడుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,31,064కు పెరిగింది. మరణాల రేటు 1.19శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
కొవిడ్ కారణంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









