బురఖాలకు, పెర్ఫ్యూమ్‌లకు పెరిగిన డిమాండ్
- April 17, 2023
బహ్రెయిన్: ఈద్ అల్ ఫితర్ నేపథ్యంలో బహ్రెయిన్ అంతటా అబయాలు, పెర్ఫ్యూమ్‌ల డిమాండ్ పెరిగిందని రిటైలర్లు చెబుతున్నారు. పండుగ అమ్మకాలు 60% నుండి 70% వరకు పెరిగాయని తెలిపారు. జిదాలీ షాపింగ్ సెంటర్ లో 100కి పైగా అబాయా షాపులు ఉండగా.. ఒక్కో స్టోర్ రమదాన్ సీజన్‌లో సగటున 150 అబాయా విక్రయాలను చేస్తున్నట్లు వెల్లడించాయి. ఫాబ్రిక్ ఎంబ్రాయిడరీ స్థాయిని బట్టి వీటి ధరలు BD10 నుండి BD60 వరకు ఉన్నాయని తెలిపారు. ఈద్ వేడుకలో పెర్ఫ్యూమ్‌లు ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది ఈద్ వేడుకలో మంచి పెర్ఫ్యూమ్ వేసుకోవడం కీలకంగా భావిస్తారు. మనామా సౌక్ లో వందలాది పెర్ఫ్యూమ్ దుకాణాలున్నాయి. వస్తున్న డిమాండ్‌ను తీర్చడానికి విస్తృత శ్రేణి పరిమళ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారాలు తెలిపారు. ఈద్ తేదీ సమీపిస్తున్న కొలది అబయాలు, పరిమళ ద్రవ్యాలకు ఇంకా డిమాండ్ పెరుగుతుందని రిటైలర్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







