తల్లి కాబోతున్న ఇలియానా.? తండ్రి ఎవరో తెలుసా.?
- April 18, 2023
గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతోంది. అవునండీ మీరు విన్నది నిజమే. అదేంటీ.? ఇలియానా ఎప్పుడు పెళ్లి చేసుకుంది.? తల్లి కావడానికి అంటారా.? ఏం తల్లి కావాలంటే పెళ్లే చేసుకోవాలా.? ఏంటీ.? మీరు మరీను.!
సరోగసీ విధానం ద్వారా తల్లి కావచ్చు. ఇప్పటికే నయనతార తదితర హీరోయిన్లు అలా సరోగసీ విధానం ద్వారా తల్లులు అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బహుశా ఇలియానా కూడా అలాగే తల్లి కాబోతోందా.? అనే విషయం పక్కన పెడితే, ఇది పుకారు మాత్రం కాదండోయ్. స్వయంగా ఇలియానా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
అండ్ సో ద అడ్వెంచర్ బిగిన్స్.. అంటూ ఇల్లీ బేబీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ‘Mama’ అని రాసి వున్న పెండెంట్ మెడలో ధరించి ‘నా లిటిల్ డార్లింగ్‌ని కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా..’ అంటూ మరో ఫోటో పోస్ట్ చేసింది.
ఈ పిక్స్‌కి నెటిజన్లు ఇలియానాకి కంగ్రాట్స్ చెబుతూ విషెస్ పంపుతున్నారు. కొందరేమో పెళ్లి కాకుండానే ఏంటీ పని.? అన్నట్లుగా ట్రోల్ చేస్తున్నారు.
గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు లవ్‌లో వున్న ఇలియనా ప్రస్తుతం కత్రినా సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్‌లో వుంది. ఇంతకీ త్వరలో రాబోతున్న ఇలియానా బిడ్డకి తండ్రి ఎవరో మరి.!
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







