నాని 30 సెంటిమెంట్.! ‘జెర్సీ’ మ్యాజిక్ నాని రిపీట్ చేస్తాడా.?
- April 19, 2023
ఇటీవలే నాని ‘దసరా’ సినిమాతో తిరుగులేని హిట్టు కొట్టి జోష్ మీదున్నాడు. ‘దసరా’ టైమ్‌లోనే తన 30 వ సినిమాని అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌నీ హుషారెత్తించాడు నాని.
ఆ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేసి, రాబోయే ఆ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు నాని. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథ వుండబోతోందనీ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా అర్ధమైంది.
గతంలో ‘జెర్సీ’ కోసం నాని తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ ఆ సినిమాలో బాగా వర్కవుట్ అవ్వడమే కాదు, నానికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా.
ఆ మ్యాజిక్ ఈ సారి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి మరి. ఇకపోతే, ఈ సినిమాకి ‘హలో నాన్న’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. విడాకులు తీసుకున్న తల్లితండ్రులిద్దరి మధ్య నలిగిపోయే చిన్నారి కథనే ‘హలో నాన్న’ అంటున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







