2023లో కొత్తగా 35 వేల ఉద్యోగాల కల్పన: ఒమన్
- April 19, 2023
మస్కట్: ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ సుల్తానేట్ 2023 సంవత్సరానికి కనీసం 35,000 ఉద్యోగ అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని హిస్ ఎక్సెలెన్సీ లేబర్ మినిస్టర్ తెలిపారు. 2023 సంవత్సరంలో కనీసం రెండు కార్యక్రమాల ద్వారా 35,000 ఉద్యోగావకాశాలు కల్పించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని కార్మిక శాఖ మంత్రి మహద్ బావిన్ వెల్లడించారు. మొదటిది రిక్రూట్‌మెంట్ -రీప్లేస్‌మెంట్.. ఇందులో మేనేజర్‌లు, స్పెషలిస్ట్‌లు, టెక్నీషియన్‌ల వృత్తులలో 8 శాతం ఉద్యోగాలను కొత్తగా కల్పించనున్నారు. రెండవది పునరావాసం- శిక్షణ ద్వారా ఆయా రంగాల్లో కొత్త వారికి అవకాశాలు కల్పించనున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ 130,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కోసం కెరీర్ ప్లాన్‌లను రూపొందించడంలో 2,000 కంటే ఎక్కువ శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహించింది. 2022లో 35,000 ఉద్యోగావకాశాలు కల్పించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, గతంలో పనిచేసిన 35,000 మందికి పైగా (రొటేషన్) అదనంగా రెండు రంగాల్లో 45,000 ఉద్యోగావకాశాలు కల్పించామని కార్మిక శాఖ మంత్రి అన్నారు. ఏప్రిల్ 18న నిర్వహించిన కార్మిక మంత్రిత్వ శాఖ వార్షిక సమావేశంలో.. 2023 సంవత్సరంలో మంత్రిత్వ శాఖ లక్ష్య పనితీరును కార్మిక శాఖ మంత్రి, హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మహద్ బిన్ సయీద్ బవాయిన్ సమీక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య







