ప్రైవేట్ సంస్థల్లో 11 శాతం పెరిగిన లోకల్ టాలెంట్స్

- April 19, 2023 , by Maagulf
ప్రైవేట్ సంస్థల్లో 11 శాతం పెరిగిన లోకల్ టాలెంట్స్

యూఏఈ: యూఏఈ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) స్థానిక జాబ్ మార్కెట్‌లో ఎమిరాటీల నియామకంలో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసినట్లు పేర్కొంది.  అథారిటీ ప్రకారం.. 2022తో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలోని ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 11 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది. పౌరులను నియమించుకున్న కంపెనీల సంఖ్య 13 శాతానికి పైగా పెరిగిందని మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.

 2023 Q1 లో ఎమిరేటైజేషన్ ఫలితాలు:
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటీల సంఖ్య 11 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. ఎమిరాటిస్‌లను నియమించుకున్న కంపెనీల సంఖ్య 13 శాతం పెరిగింది. 2023 మొదటి మూడు నెలల్లో 5000 కంటే ఎక్కువ మంది యూఏఈ జాతీయులు కెరీర్ కౌన్సెలింగ్ నుండి ప్రయోజనం పొందారు.

క్యూ1 2023లో ఎమిరాటీలు పనిచేసే టాప్ 5 రంగాలు: 1. వ్యాపార సేవలు - 10% వృద్ధి, 2.నిర్మాణ రంగం - 14% వృద్ధి, 3.వాణిజ్యం -మరమ్మతు సేవలు - 13% వృద్ధి, 4. ఫైనాన్షియల్ బ్రోకరేజ్ - 4% వృద్ధి, 5.తయారీ పరిశ్రమ - 10% వృద్ధి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com