ఉచిత ఆరోగ్య పరీక్షల ప్యాకేజీని విడుదల చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- April 20, 2023
హైదరాబాద్: ప్రపంచ కాలేయ దినోత్సవం(World liver day 2023) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే లక్ష్యంగా ఉచిత ఆరోగ్య పరీక్షల ప్యాకేజీని విడుదల చేయడం జరిగింది.
ఉచిత ఆరోగ్య పరీక్షలు : USG ABDOMEN , లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మరియు సర్జికల్ / మెడికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్టేషన్. ఈ అవకాశం ఈ నెల 19th ఏప్రిల్ నుంచి 31st ఏప్రిల్ 2023 వరకు మాత్రమే.
World liver day 2023:మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం. కాలేయం (Liver) మానవ శరీరానికి అత్యంత ముఖ్యమైన మరియు సంక్లిష్టమైన అవయవాలలో ఒకటి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తి (Immunity power) ,జీర్ణక్రియ వంటి వాటికి దోహదం చేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలు ముఖ్యమైనవే.కానీ వాటిలో కాలేయం కొంచెం భిన్నం. ఎందుకంటే..ఏ సమస్య వచ్చినా.. శరీరం ముందే సంకేతాలు ఇస్తుంది. కానీ కాలేయం విషయంలో అలా కాదు. పూర్తిగా భిన్నం. కాలేయం పూర్తిగా నాశనం అయ్యే వరకు ఎలాంటి సంకేతాలను ఇవ్వదు. కాబట్టి ఎటువంటి సమస్యలు లేవని కాలేయాన్ని శ్రద్ధ చూపకపోవడం కచ్చితంగా ముప్పే అంటున్నారు.కన్సల్టెంట్ సర్జికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ & లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీమన్నారాయణ అటువంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి, ఏటా ఏప్రిల్ 19 ప్రపంచ కాలేయ దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం కాలేయ సంబంధిత వ్యాధులు భారతదేశంలో మరణాలకు అత్యంత సాధారణ కారణం. వ్యాధులు వెంటనే లక్షణాలను చూపించనప్పటికీ, ఉక్కిరిబిక్కిరి అవుతున్న వ్యాధి సంకేతాలను గమనించడం అసాధ్యం కాదు.మీరు కాలేయ సంబంధిత వ్యాధి బారిన పడుతూ ఉంటే మీ శరీరం దానిని సూచించవచ్చు - కాళ్లు ,చీలమండలలో వాపు, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, కామెర్లు, కడుపు నొప్పి, మూత్రం రంగులో మార్పు, పొట్ట చుట్టూ దురద, ఎరుపు చర్మం, మలంలో రక్తం మొదలైనవి. ఈ లక్షణాలను విస్మరించకూడదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ప్రబలంగా ఉన్నట్లయితే తక్షణ వైద్య సహాయం అవసరం. ఒక వ్యాధి అభివృద్ధి అయిన తర్వాత కష్టంగా మారే బదులు, కాలేయ ఆరోగ్యాన్ని ముందుగానే గ్రహిస్తే తద్వారా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
మద్యం మానుకోండి. ఆల్కహాల్ మీ శరీరాన్ని విపరీతంగా డీహైడ్రేట్ చేస్తుంది. మీ కాలేయం శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని కష్టతరం చేస్తుంది.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ఆకు కూరలు ,పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఒత్తిడి తగ్గించుకోండి.
ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట మరియు హైటెక్ సిటీ నందు అందుబాటులో కలవు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ డాక్టర్ శరన్స్, సెంటర్ హెడ్ హృషీకేశ్, డాక్టర్ మొయిన్ , డాక్టర్ భార్గవ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









