2 బిలియన్లు దాటిన దుబాయ్ మెట్రో రైడర్స్.. షేక్ మహమ్మద్ ఎమోషనల్ ట్వీట్
- April 25, 2023
దుబాయ్: ‘‘మెట్రో లేకుండా దుబాయ్‌ని ఊహించడం వాస్తవంగా అసాధ్యం. ప్రజా రవాణా వ్యవస్థ 2009 సెప్టెంబర్‌లో ప్రారంభమైనప్పటి నుండి 2 బిలియన్లకు పైగా నివాసితులు మరియు పర్యాటకులను తీసుకువెళ్లింది. కానీ చాలా మంది అధికారులు దీనిని ప్రారంభించాలనే నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదని మీకు తెలుసా?’’ అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దుబాయ్ మెట్రోను ప్రారంభించే “ధైర్యమైన నిర్ణయం”తో ఎలా ముందుకు వెళ్లామో అందులో వివరించారు. సెప్టెంబర్ 2019 దుబాయ్ మెట్రో ప్రారంభించడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను షేక్ మహమ్మద్ గుర్తుచేసుకున్నారు. “నేను రైలు కాక్‌పిట్‌ను చూడాలని పట్టుబట్టి మా నాన్నతో కలిసి 1959లో లండన్‌ని సందర్శించినప్పుడు నాకు 10 సంవత్సరాలు. 50 ఏళ్ల తర్వాత 2009లో దుబాయ్ మెట్రో నిజమైంది. కలలు కనగలిగితే సాధ్యం కానిది ఏదీ లేదు’’ అని తన ట్వీట్ లో షేక్ మహమ్మద్ తెలిపారు. యూఏఈ డిక్షనరీలో ‘అసాధ్యం’ అనే పదం లేదని షేక్ మహ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







