గుదైబియా రెసిడెన్షియల్ అగ్నిప్రమాదంలో మహిళ మృతి
- April 27, 2023
బహ్రెయిన్: గుదైబియాలోని బహుళ అంతస్తుల నివాస భవనంలో నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఆసియా మహిళ(36) ఊపిరాడక మరణించింది. నివాసితులను ఆ భవనం నుంచి ఖాళీ చేయించడానికి సివిల్ డిఫెన్స్ బృందాలు అర్ధరాత్రి వరకు శ్రమించాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ కంట్రోల్ రూమ్ పరిస్థితులను సమీక్షించింది. సమాచారం అందగానే ఎనిమిది వాహనాలు, 26 మంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని డైరెక్టరేట్ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ఇంట్లోని ఎయిర్ కండీషనర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మరోవైపు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గత రెండేళ్లలో దుకాణాలు, రెస్టారెంట్లు, బేకరీలలో తనిఖీలు చేపట్టి అగ్ని రక్షణ వ్యవస్థలకు సంబంధించి 774 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







