మరోసారి వాయిదా పడిన 'కబాలి' విడుదల
- May 09, 2016
వరుస ఫ్లాప్ ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ డ్రామా కబాలీ. రజనీ ఏజ్ కు, ఇమేజ్ కు తగ్గ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను సమ్మర్ సీజన్ మొదట్లోనే రిలీజ్ చేయాలని భావించారు చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది.ఆ తరువాత తమిళనాట ఎన్నికల హడావిడి మొదలు కావటంతో రజనీ మరోసారి వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఎన్నికలు పూర్తవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో కబాలీ రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మరోసారి షాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. జూన్ 3న రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమాను వాయిదా వేశారు. నెల ఆలస్యంగా జూలై 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రజనీ నిర్ణయం అభిమానులకుకు నిరాశ కలిగించినా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నితిన్ కు మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అ.. ఆ..' సినిమా జూన్ 3న రిలీజ్ అవుతోంది. అదే రోజు కబాలీ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ పడుతోన్న చిత్రయూనిట్, రజనీ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కబాలీలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుండగా, రజనీ ముసలి డాన్ గా కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!







