-: పదవి – పెదవి :-
- May 09, 2016పదవి లో ఉన్న పెద్దలు మీరు,
మీ మాటకు ఎదురెళ్లదు నీరు,
తిరుగు లేని మీ మాట
ప్రకంపనాల మూట,
ప్రజాస్వామ్యానికి తూట
ప్రజాధనం లో ఎంత మీ వాటా?
మూర్ఖులు వేసారు మీకు పెద్ద పీట,
మీ చుట్టూ దోపిడీ దొంగల ముఠా
ఎన్నో ఏండ్లుగా పెట్టుబడి మీద పైసా వడ్డీకి
నోచుకోని రాజకీయ పెట్టుబడి దారులు,
భూ కబ్జాలు చేసే బడాబాబులు మీరు.
పాపం! వాళ్లకి మీరిచ్చారు అవకాశం
కాలరాసిన కాల్ మనీ లో కాంతలందరూ
కామాంధుల చేతుల్లో, బౌన్సర్ల బాహుబలాల్లో
బలి పశువులైపొయారు!
మీ చట్టంలో నిర్దోషులపై లాఠి విసరగలదు!
ఓటు బ్యాంకు, నోటు బ్యాంకు మీకు ముఖ్యం,
రోజు కూలీ, రోగానికి మందు మాకు ముఖ్యం
మత తత్యాలు, కుల, వర్గపోరాటాలు,
ఇసుక, నీరు, భూమి కోసం నిత్యం తగాదాలు
నిత్య నరమేధాలు, ఆర్త నాదాలు!
--డా.కోడి రామా రావు(అల్ అయిన్)
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం