10,000 బిన్ లాడెన్ కార్మికులకు వేతనాలు

- May 09, 2016 , by Maagulf
10,000 బిన్ లాడెన్ కార్మికులకు వేతనాలు

సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ 10,000 మంది ఉద్యోగులకు మే నెల వేతనాలు చెల్లించనుందని లేబర్ మినిస్ట్రీ మక్కా బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ అల్యాన్ వెల్లడించారు. సుమారు 16,000 మంది ఉద్యోగుల ట్రాన్స్ఫర్ ప్రక్రియ నడుస్తోందనీ, పలు జాతీయ కంపెనీల్లో వీరికి అవకాశాలు దక్కుతాయని ఆయన చెప్పారు. 24 గంటల్లో ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తి కానుంది. బిన్లాడిన్ గ్రూప్ కార్మికులు చాలా అనుభవజ్ఞులనీ, వారి స్కిల్స్ లేబర్ మార్కెట్లో వారికి వెంటనే ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడ్తాయని చెప్పారు. బిన్లాడెన్ కంపెనీ 69,000 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసిందని అల్ అయాన్ చెప్పారు. రెసిడెన్సీ కార్డుల రెన్యూవల్ ఈ కార్మికులకు మినహాయింపబడిందని చెప్పారాయన. బిన్లాడిన్ గ్రూప్ ఇటీవల బ్లాక్ లిస్ట్లో పెట్టబడింది, మక్కాలో గ్రాండ్ మాస్క్ గత హజ్ సీజన్లో కుప్పకూలిన ఘటనలో 107 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెట్టబడింది. ఇతర ప్రాజెక్టుల చేపట్టడానికి ఆ సంస్థకు అనుమతులు నిరాకరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com