డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా..!
- April 28, 2023
రియాద్: డ్రగ్స్‌పై సౌదీ అరేబియా యుద్ధాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వ్యాప్తిని ఎదుర్కోవడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విఫలం చేయడమే లక్ష్యంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం సందర్భంగా.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వారు రాజ్యవ్యాప్తంగా అనేక నగరాల్లో వివిధ రకాల డ్రగ్స్‌ను మార్కెటింగ్ చేస్తూ.. విక్రయిస్తున్నారు. వీరిలో జెడ్డాలో ఒక ప్రవాసుడితో సహా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరు మాదక ద్రవ్యాన్ని వ్యాప్తి చేయడంలో పాలుపంచుకున్నారు. రియాద్ నగరంలో డ్రగ్స్ పిల్స్ ప్రచారం చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. డైరక్టరేట్ అధికారులు హషీష్ చెలామణి చేస్తున్నందుకు జజాన్‌లో ఇద్దరు వ్యక్తులను.. అసిర్, తూర్పు ప్రావిన్స్, అల్-ఖాసిమ్‌లలో ఒక్కొక్కరిని అరెస్టు చేశారు. తూర్పు ప్రావిన్స్‌లో అరెస్టయిన వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హషీష్‌ను సర్క్యులేట్ చేస్తూ దొరికిపోయాడు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సహకారంతో దానిమ్మ పండ్ల రవాణాలో దాచిన 12 మిలియన్లకు పైగా నార్కోటిక్ యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణాను విఫలమైనట్లు GDNC వెల్లడించింది. డైరెక్టరేట్ అన్ని రకాల డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తన ప్రచారాల పద్దతిలో సామాజిక బాధ్యత అంశాన్ని హైలైట్ చేసింది. "రిపోర్ట్ దెమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. డైరెక్టరేట్ డ్రగ్స్ శాపానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించడంలో చురుకుగా ఉంది. "డ్రగ్స్‌పై యుద్ధం" అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 6,500 మంది అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ మెగా వీడియో కాన్ఫరెన్స్
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్‌కు విశిష్ట గుర్తింపు
- గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!









