చరిత్ర సృష్టించిన యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి
- April 29, 2023
యూఏఈ: స్పేస్‌సూట్ స్లీవ్‌పై యూఏఈ జెండా.. 'ఇంపాజిబుల్ ఈజ్ పాజిబుల్' లోగోతో ఎమిరాటీ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వెలుపల వాక్ చేసి చరిత్ర సృష్టించాడు. స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామిగా రికార్డు నమోదు చేశాడు. అల్నెయాడి, అనుభవజ్ఞుడైన నాసా వ్యోమగామి స్టీఫెన్ బోవెన్ సాయంత్రం 5.11 గంటలకు (యూఏఈ కాలమానం ప్రకారం) ఆరు గంటల పాటు స్పేస్ వాక్ ను ప్రారంభించారు. ISSలో ఉన్న నాసా ఫ్లైట్ ఇంజనీర్లు ఫ్రాంక్ రూబియో, వుడీ హోబర్గ్ కూడా వారికి సూట్ అప్ చేయడంలో సహకరించారు. ఈ సందర్భంగా "సుల్తాన్ అభినందనలు. మీరు ఈ రోజు చరిత్ర సృష్టిస్తున్నారు." అని హోబర్గ్ అభినందనలు తెలిపారు.
యూఏఈ వ్యోమగామి హజ్జా అల్మన్సూరి.. 2019లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ఎమిరాటీ. ఆ సమయంలో ఎక్స్‌పెడిషన్ 69 ఇంక్రిమెంట్ లీడ్‌గా పనిచేశారు. అతను హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ నుండి మిషన్‌ను పర్యవేక్షించారు. మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC)లోని ఎమిరాటీ బృందం కూడా స్పేస్ వాక్ ని ప్రత్యక్షంగా తిలకించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







